ప్రపంచ వేదికపై 'వారణాసి'.. మెక్సికోలో రేపే తొలి గ్లోబల్ ఈవెంట్!

  • పాన్-వరల్డ్ మూవీ 'వారణాసి' గ్లోబల్ ప్రమోషన్స్ షురూ
  • మెక్సికోలో జరగనున్న CCXP 2026 ఈవెంట్‌లో ప్రత్యేక ప్యానెల్
  • వేడుకకు హాజరుకానున్న రాజమౌళి, చిత్ర బృందం
  • తొలిసారిగా బీటీఎస్‌ వీడియోల ప్రదర్శన.. మేకింగ్ విశేషాల వెల్లడి
  • కార్యక్రమం అనంతరం ప్రేక్షకులతో నేరుగా ముఖాముఖి
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-వరల్డ్ చిత్రం ‘వారణాసి’ తన అంతర్జాతీయ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ సినిమా తొలి గ్లోబల్ ప్రజెంటేషన్ కోసం మెక్సికో వేదిక కానుంది. రేపు అక్కడ జరగనున్న ప్రతిష్ఠాత్మక CCXP 2026 ఈవెంట్‌లో ‘వారణాసి’ కోసం ఒక ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంతో సినిమా అంతర్జాతీయ ప్రమోషన్లు అధికారికంగా ప్రారంభం కానున్నాయి.

ఈ వేడుకలో చిత్ర బృందంతో పాటు దర్శకుడు రాజమౌళి కూడా పాల్గొంటారని సమాచారం. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ ‘బిహైండ్ ది సీన్స్’ (బీటీఎస్‌) వీడియోలను ప్రదర్శించనున్నారు. అలాగే, సినిమా మేకింగ్ విశేషాలను చిత్ర యూనిట్ అక్కడి ప్రేక్షకులతో పంచుకోనుంది. ప్రజెంటేషన్ పూర్తయిన తర్వాత చిత్ర బృందం ఆడియన్స్‌తో నేరుగా ముచ్చటించనుండటం ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

భారతీయ సంస్కృతి, పురాణాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రత్యేక ఈవెంట్ ద్వారా గ్లోబల్ ఆడియన్స్‌కు భారతీయ కథను కొత్తగా పరిచయం చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది.

Varanasi Movie
Varanasi
CCXP 2026
Rajamouli
Mexican Event
Global Event
Indian Culture
Mythology Movie
Pan World Movie
Movie Promotions

More Telugu News